ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పనితీరును బలోపేతం చేసేందుకు కొత్త పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ప్రతి మండలానికి ఒక డిప్యూటీ ఎంపీడీవోను నియమించనుంది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రేడ్-1 ఉద్యోగుల్లో అర్హులైన వారికి పదోన్నతులు ఇచ్చి ఈ పదవులకు నియామకాలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అర్హుల జాబితా సిద్ధం చేయాలని పీఆర్, పంచాయతీ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.