పవన్ కల్యాణ్ 55వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ, రాజకీయ ప్రస్థానంపై నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. 1971 సెప్టెంబర్ 2న జన్మించిన ఆయన 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’, ‘గబ్బర్‌సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి సినిమాలతో ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. 2014లో
జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. 2019లో ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ వెనక్కి తగ్గలేదు. . 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచి, జనసేనను 21 స్థానాల్లో గెలిపించి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.