ఎనర్జీ డ్రింక్స్ బ్రాండింగ్‌పై FSSAI చర్యలు

791చూసినవారు
ఎనర్జీ డ్రింక్స్ బ్రాండింగ్‌పై FSSAI చర్యలు
దేశ ఆహార భద్రత నియంత్రణ సంస్థ FSSAI, ప్రముఖ ఎనర్జీ డ్రింక్ బ్రాండ్లకు నోటీసులు జారీ చేసింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా బ్రాండింగ్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఆరోగ్య సంబంధిత వాదనలు చేయడంపై ఈ చర్య తీసుకున్నట్లు FSSAI తెలిపింది. భారతదేశంలో "ఎనర్జీ డ్రింక్" అనే పేరుతో ప్రత్యేక ఫుడ్ కేటగిరి లేదా అధికారిక ప్రమాణం లేదని, అయినప్పటికీ కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను శక్తిని పెంచుతాయి, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి వంటి వాదనలతో ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది. రెడ్ బుల్, అడ్రినలిన్ రష్, క్యాంపా ఎనర్జీ గోల్డ్ బూస్ట్, స్టింగ్, హెల్ ఎనర్జీ, మాన్‌స్టర్ ఎనర్జీ వంటి బ్రాండ్‌లకు నోటీసులు అందాయి.

సంబంధిత పోస్ట్