AP: విజయవాడలో గాదె సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన సిట్ అధికారులు అక్కడ అనుమానాస్పద మరకలను గుర్తించారు. అలాగే స్టేషన్ టెర్రస్‌పై ఎముకలు, బూడిద ఆనవాళ్లు లభ్యమైనట్లు సమాచారం. కాలిన హ్యాండ్ గొలుసు, లాఠీని సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. సేకరించిన ఆధారాల ఆధారంగా కస్టడీలో తీవ్ర గాయాల కారణంగానే సాయికృష్ణ మృతి చెందినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.