రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిని గుణపాఠంగా భావిస్తున్నామని, తప్పుల నుంచి నేర్చుకుని రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగ్గా ఆడతామని సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ 'మా ఇన్నింగ్స్ ఆరంభంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాం. బ్యాటింగ్ మరింత మెరుగ్గా చేసి ఉంటే 150-160 పరుగులు చేసేవాళ్లం. ఈ ఓటమిని ఇక్కడే మర్చిపోయి ముందుకు సాగుతామని' గైక్వాడ్ తెలిపారు.