గంభీర్ కోచ్‌గా కొనసాగాలి: బవుమా

3483చూసినవారు
గంభీర్ కోచ్‌గా కొనసాగాలి: బవుమా
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత జట్టుకు ఊహించని చెత్త రికార్డులు నమోదవుతున్నాయి. వన్డే, టెస్టుల్లో జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా గంభీర్‌కు మద్దతుగా నిలిచాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ టీమిండియా టెస్ట్ క్రికెట్ పరివర్తన దశలో ఉందని, గంభీర్‌కు కొంచెం సమయం ఇవ్వాలని బీసీసీఐకి సూచించాడు. వన్డేల్లో కోహ్లీ, రోహిత్ ఉన్నా, టెస్టుల్లో వారు అందుబాటులో లేరని, గంభీర్ రెడ్-బాల్ ఫార్మాట్‌లో కొత్త మార్గాన్ని కనుగొనాల్సి ఉందని బవుమా పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్