గంజాయి డాన్ టీడీపీకి చెందిన వ్యక్తి: కాకాణి గోవర్థన్‌రెడ్డి

1538చూసినవారు
గంజాయి డాన్ టీడీపీకి చెందిన వ్యక్తి: కాకాణి గోవర్థన్‌రెడ్డి
నెల్లూరులో గంజాయి డాన్ అరవ కామాక్షి టీడీపీకి చెందిన వ్యక్తి అని, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆమెకు అండగా ఉన్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. కామాక్షి ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికిందని, ఇది ప్రభుత్వ వైఫల్యం అని ఆయన అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని హామీ ఇచ్చారని, కానీ 550 రోజులు పూర్తైనా ఆ పని చేయలేదన్నారు. స్థానికులు ఆగ్రహంతో కామాక్షి ఇంటిని కూల్చివేయడం ప్రజల్లో పెరిగిన అసహనానికి నిదర్శనం అని కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్