AP: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జనచైతన్య నగర్ కాలనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు వేగంగా వ్యాపించి పక్కనే పార్క్ చేసిన కారుకు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడటంతో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.