వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు?

1504చూసినవారు
వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు?
జీవనశైలి వల్ల పెరుగుతున్న హై కొలెస్ట్రాల్ సమస్యకు వంటింటి నివారణగా వెల్లుల్లి పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లిలోని అలిసిన్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, వెల్లుల్లి రక్తాన్ని శుద్ధి చేసి, గుండెను రక్షించే ఔషధం. అయితే, సమతుల్య ఆహారం, వ్యాయామం, నిద్ర కూడా అవసరం. రక్తాన్ని పలచబరిచే గుణం ఉన్నందున, వైద్యుల సలహా మేరకే దీనిని ఔషధంగా వాడాలి. పచ్చి వెల్లుల్లిని తేనెతో, గోరువెచ్చని నీటితో లేదా పాలల్లో మరిగించి తీసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్