గుజరాత్ రాజ్‌కోట్ లో సాధనా సొసైటీలోని ఓ ఆపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో స్థానికులు గుమిగూడి గార్డెన్ హోస్‌తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఓ గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా భారీ శబ్దంతో పేలింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు వివరించారు.