భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

29862చూసినవారు
భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
దేశంలోని ఎల్‌పీజీ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. జులై 1వ తేదీన విడుదల చేసిన కొత్త ధరల ప్రకారం.. ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయి. 19 కిలోల కమర్షియల్ (వాణిజ్య) గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 183.50 తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన ధరల ప్రకారం ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,930కి చేరింది. ఈ ఏడాదిలో కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి. అయితే, సామాన్యుడు ఉపయోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

సంబంధిత పోస్ట్