ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది. దేశంలో వ్యూహాత్మక ఎల్పీజీ నిల్వలను పెంచే ప్రణాళికలో భాగంగా, కిలోకు రూ.1.29 అదనపు రుసుము విధించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమలైతే సాధారణ 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర సుమారు రూ.18 వరకు పెరగొచ్చు. అలాగే సీఎన్‌జీపై కూడా అదనపు రుసుము విధించే అంశం పరిశీలనలో ఉంది. అయితే ఈ ప్రతిపాదనకు ఇంకా కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించలేదు. అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాతే కొత్త ధరలపై స్పష్టత రానుంది.