జూలై 1 నుండి దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి పలు కీలక నిబంధనలు మారనున్నాయి. ఒకే ఇంట్లో పీఎన్‌జీ, ఎల్‌పీజీ కనెక్షన్లు రెండూ ఉండరాదని, పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నవారు 30 రోజుల్లోగా ఎల్‌పీజీ కనెక్షన్‌ను రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే, ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్నవారందరూ జూన్ 30 లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని, లేనిపక్షంలో గ్యాస్ సేవలకు అంతరాయం ఏర్పడవచ్చు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గం తెరుచుకోవడంతో గ్యాస్ బుకింగ్ మధ్య ఉండే గడువు కాలపరిమితి తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.