కర్నూలు పట్టణంలోని బాలాజీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలడంతో కూలర్ల గోదాంలో ప్లాస్టిక్ సామగ్రి ఉండటంతో మంటలు చెలరేగి, భారీగా పొగలు అలముకున్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పని చేసే సిబ్బంది వంట కోసం తెచ్చిన రెండు గ్యాస్ సిలిండర్లు పేలడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.