భారత సైన్యానికి 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బుధవారం ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేఎం సేథ్ అయిన తన తండ్రికి జనరల్ ధీరజ్ సేథ్ సెల్యూట్ చేయగా.. ఆయన సోదరుడు, రియర్ అడ్మిరల్ రవ్నీశ్ సేథ్ కొత్త ఆర్మీ చీఫ్‌కు సెల్యూట్ చేయడం విశేషంగా నిలిచింది.