‘టీచర్ ఉద్యోగం తెచ్చుకోండి’.. భార్య చివరి కోరిక తీర్చిన భర్త

7642చూసినవారు
‘టీచర్ ఉద్యోగం తెచ్చుకోండి’.. భార్య చివరి కోరిక తీర్చిన భర్త
AP: ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ-వెంకటరమణ దంపతులు. వెంకటరమణ ఏడాది క్రితం డెంగ్యూతో మరణించింది. రామకృష్ణ చిరుద్యోగం చూస్తూనే ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నాడు. తనను టీచర్‌గా చూడాలనుకున్న అర్ధాంగి చివరి కోరికను తీర్చాలనుకున్నాడు. మెగా డీఎస్సీ ప్రకటన వచ్చినప్పటి నుంచి రోజుకు 17 గంటలు కష్టపడ్డారు. 70.02మార్కులతో బయాలజీ టీచర్‌గా ఎంపికయ్యారు. తన విజయాన్ని భార్యకు అంకితం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్