ఇరాన్ నుంచి ఇండియన్స్ తక్షణమే బయటకు రండి: కేంద్రం

9193చూసినవారు
ఇరాన్ నుంచి ఇండియన్స్ తక్షణమే బయటకు రండి: కేంద్రం
ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే, కేంద్ర ప్రభుత్వం ఇరాన్‌లో నివసిస్తున్న భారత పౌరులకు తాజా మార్గదర్శకాలను బుధవారం జారీ చేసింది. తక్షణమే ఆ దేశం విడిచి రావాలని సూచించింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం, సురక్షిత మార్గాల ద్వారానే దేశం విడిచి వెళ్లాలని, ముందస్తు అనుమతి లేకుండా అంతర్జాతీయ భూ సరిహద్దుల వైపు వెళ్లవద్దని హెచ్చరించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను అందుబాటులోకి తెచ్చింది. ఏప్రిల్ 10న ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్