TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే యంత్రాంగం సన్నద్ధం కావాలని, ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ఇతర మౌలిక వసతుల కల్పనపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.