స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి..గెలుపే లక్ష్యం: జగన్

33చూసినవారు
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి..గెలుపే లక్ష్యం: జగన్
AP: రాజమండ్రిలో వైసీపీ నేతలతో సమావేశమైన జగన్, స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, శాంతిభద్రతలు దారుణంగా దిగజారాయని, ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. ప్రియాంక కేసును నీరుగారుస్తున్నారని, వైసీపీపై ప్రజాదరణ పెరుగుతోందని, మరో ఏడాదిలో పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. అలాగే ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం తమదేనని, ప్రజలతో మమేకమై పనిచేయాలని జగన్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్