ఘట్టమనేని కుటుంబం నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న జయకృష్ణ హీరోగా నటిస్తున్న 'శ్రీనివాసమంగాపురం' సినిమా విడుదల వాయిదా పడినట్లు చర్చ జరుగుతుంది. 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని హీరోయిన్‌గా పరిచయమవుతోంది. మొదట జూలై 8న విడుదల కావాల్సిన ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి, ప్రమోషన్స్ కోసం మరికొంత సమయం కేటాయించాలనే ఉద్దేశంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది.దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.