అల్లం టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కానీ అధికంగా తీసుకుంటే కడుపులో మంట, ఎసిడిటీ, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. రక్తం పలచబడే మందులు వాడేవారు, బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే రక్తస్రావం ప్రమాదం పెరుగుతుందంటున్నారు. తక్కువ బీపీ ఉన్నవారిలో బీపీ అకస్మాత్తుగా పడిపోయి నీరసం, తలతిరగడం వంటివి సంభవించవచ్చు. రాత్రిపూట తాగితే అల్లంలోని ఘాటైన గుణాలు మెదడును యాక్టివ్‌గా ఉంచి నిద్రలేమికి దారితీయవచ్చు. రోజుకు 4-5 గ్రాముల కంటే ఎక్కువ అల్లం వాడటం మంచిది కాదు. సరైన మోతాదులో తీసుకుంటే వికారం, వాంతులు, అజీర్ణం, కడుపు నొప్పిని తగ్గిస్తుంది.