టీసీ ఇవ్వడం లేదంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాలిక

2191చూసినవారు
టీసీ ఇవ్వడం లేదంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాలిక
జగిత్యాల జిల్లాలో 7వ తరగతి చదువుతున్న గ్రీష్మ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాను ఇంతకుముందు చదివిన స్కూల్ టీసీ ఇవ్వడం లేదని ఆమె సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తల్లి అనారోగ్యం కారణంగా పాఠశాలకు సరిగా హాజరు కాలేకపోయానని, టీసీ ఆలస్యంగా రావడంతో మరో ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవడానికి నిరాకరించారని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. పరీక్షలు దగ్గరపడుతున్నాయని, చదువుకోవాలనే ఆసక్తి ఉందని, పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని కలెక్టర్‌ను వేడుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్