AP: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో వైద్యం వికటించి ఓ బాలిక (11) మృతి చెందినట్లు ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. క్రిస్టియన్ లైన్ వీధికి చెందిన ప్రేమ్ కుమార్-తులసీరెడ్డి దంపతుల కుమార్తె మోక్షితకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యురాలు బాలికను పరీక్షించి ఓ ఇంజెక్షన్ ఇవ్వడంతో.. కొంతసేపటికే ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. రెండు గంటల తర్వాత బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక మృతితో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.