వసతి గృహంలో బిడ్డకు జన్మనిచ్చిన బాలిక

100చూసినవారు
వసతి గృహంలో బిడ్డకు జన్మనిచ్చిన బాలిక
AP: గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఓ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. కడపలోని ఓ గిరిజన బాలికల వసతి గృహంలో ఉంటూ.. ఓ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో 17 ఏళ్ల బాలిక చదువుతోంది. 9 నెలలుగా ఆమె వసతి గృహంలోనే ఉంటున్నా.. గర్భం దాల్చిన విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. బుధవారం రాత్రి పురిటినొప్పులు రావడంతో బాలిక స్వయంగా రిమ్స్‌కు వెళ్లింది. అక్కడ వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. కాలేజీలో ఓ సీనియర్ విద్యార్థితో ఆమె చనువుగా ఉండేదని, గర్భం దాల్చడానికి అతనే కారణమై ఉంటాడని సమాచారం.

ట్యాగ్స్ :