AP: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై డీఐజీ కోయ ప్రవీణ్ వివరాలు వెల్లడించారు. ‘బాలికపై అత్యాచారం జరిగింది. చిన్నారిని అత్యాచారం చేసి నీటిలో ముంచి చంపాడు. నిందితుడు కులవర్ధన్‌పై సమగ్రంగా ఆరా తీస్తున్నాం. ప్రస్తుతం నిందితుడు మా అదుపులో లేడు. నిందితుడి కోసం గాలిస్తున్నాం’ అని డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు.