ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఫోన్ నంబరు బ్లాక్ చేశాడన్న కోపంతో ఓ యువతి తన ప్రియుడు ప్రసాద్ సూర్యవంశీ (25)ని కత్తితో పొడిచి చంపింది. శుభమ్ విహార్ టీచర్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న ప్రసాద్‌తో యువతికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇటీవల మనస్పర్థలు రావడంతో ప్రసాద్ ఆమె ఫోన్ నంబరును బ్లాక్ చేశాడు. ప్రియుడి ఇంటికి వెళ్లి మొబైల్ ఛాటింగ్స్ చూపించాలని పట్టుబట్టింది. ప్రసాద్ నిరాకరించడంతో, ఆమె తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు.