ఒకప్పుడు వారసుడు కచ్చితంగా పురుషులే కావాలనే ధోరణి ఉండేది. ఆడపిల్లలను అత్తింటికి పరిమితం చేసేవారు. కానీ ఇప్పుడు సమాజంలో మార్పు వస్తోంది. ఆడపిల్లలను కూడా వారసులుగా భావిస్తున్న తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతోంది. లింగ అసమానత కారణంగా చాలామంది అబ్బాయిలకు వివాహాలు కావడం లేదు. ఆడవాళ్లపై ఆంక్షలు తగ్గి, అన్ని రంగాల్లో స్వేచ్ఛ లభిస్తోంది. ఇటీవల ఓ సర్వేలో, వారసులుగా మగవాళ్ల కంటే ఆడవాళ్లే బాగుంటారని, వారు బాధ్యతగా, ప్రేమగా ఉంటారని, వృద్ధాప్యంలో తోడుగా ఉంటారని తల్లిదండ్రులు బలంగా నమ్ముతున్నారని తేలింది.