సచివాలయాల పనితీరుపై నివేదిక ఇవ్వండి: పవన్ కళ్యాణ్

21005చూసినవారు
సచివాలయాల పనితీరుపై నివేదిక ఇవ్వండి: పవన్ కళ్యాణ్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు, వ్యవస్థ నిర్మాణంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఉద్యోగుల పదోన్నతులు, ఇతర శాఖలతో అనుసంధానంపై సమీక్షించిన ఆయన, పదోన్నతులు కల్పించినా సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా చూడాలని సూచించారు. ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రతినెలా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్