AP: రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి CRDA విజన్-2047ను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా అర్బన్ డిజైన్స్, ఆర్కిటెక్చరల్ గైడ్లైన్స్ కోసం ప్రజలు, సంస్థల నుంచి సలహాలు, అభ్యంతరాలను తెలపాలని కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు https://crda.ap.gov.in/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తమ పేరు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, అడ్రస్ వివరాలు అందించి అభిప్రాయాలను తెలియజేయవచ్చు.