పెద్దల మాత్రలు పిల్లలకు ఇవ్వడం ప్రాణాలకే ప్రమాదం: నిపుణులు

12132చూసినవారు
పెద్దల మాత్రలు పిల్లలకు ఇవ్వడం ప్రాణాలకే ప్రమాదం: నిపుణులు
పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు కంగారుపడి పెద్దల మాత్రలను సగానికి విరిచి పిల్లలకు వేస్తుంటారు. అయితే, ఇలా చేయడం పిల్లల ప్రాణాలకే అత్యంత ప్రమాదకరమని ప్రముఖ శిశువైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లల బరువు, వ్యాధి తీవ్రత, మందు స్వభావం ఆధారంగానే మోతాదును నిర్ణయిస్తారు. మాత్రలను విరిచినప్పుడు మందు కణాలు సమానంగా పంపిణీ కావు. కొన్ని ప్రత్యేక పూత పూసిన మాత్రలను విరిస్తే తీవ్ర దుష్ప్రభావాలు వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్