AP: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లూ తీరు మార్చుకోవాలి. బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజలను నియంత్రించకూడదు. రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకులు నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటికే రైతులకు రుణాలు ఇవ్వాలి. ఖరీఫ్ సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు’ అని అన్నారు.