ప్రపంచ సంక్షోభానికి భారత్ బెదిరిపోదు: మోదీ

1740చూసినవారు
ప్రపంచ సంక్షోభానికి భారత్ బెదిరిపోదు: మోదీ
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు, ప్రపంచ ఇంధన సంక్షోభం మధ్య భారత్ ఏమాత్రం బెదిరిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉందన్నారు. ఆదివారం 132వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లోని కోటి మంది భారతీయుల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం వదంతులు వ్యాప్తి చేయవద్దని, ప్రభుత్వ సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. దేశీయంగా ఇంధన భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, పైప్డ్ నేచురల్ గ్యాస్ మౌలిక సదుపాయాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్