గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL) ఒకే రోజు రెండు కీలక విజయాలు సాధించింది. భారత నౌకాదళం కోసం నిర్మించిన ఎన్‌జిఓపివి ఐఎన్ఎస్ శాచి (యార్డ్ 1280)ని విజయవంతంగా జలప్రవేశం చేయించింది. అదే సమయంలో, భారత కోస్ట్ గార్డ్ కోసం నిర్మించిన ఐసిసిజిఎస్ అచల్ (యార్డ్ 1274)ను అప్పగించింది. వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి, జిఎస్ఎల్ ఉన్నతాధికారుల సమక్షంలో షగున్ సోబ్తి ఐఎన్ఎస్ శాచి జలప్రవేశాన్ని నిర్వహించారు. భారత కోస్ట్ గార్డ్ డిఐజి వి.కె. పర్మార్ సమక్షంలో ఐసిసిజిఎస్ అచల్ కమాండింగ్ ఆఫీసర్ దానిని స్వీకరించారు.