AP: గోదావరి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నట్లు APSDMA తెలిపింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయం వరద ప్రవాహం 6.72 లక్షల క్యూసెక్కులుగా ఉండగా, రాత్రి 7 గంటలకు అది 6.28 లక్షల క్యూసెక్కులకు తగ్గినట్టు పేర్కొంది.
పూర్తిగా వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర సమయంలో 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని కోరింది.