AP: ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులకు చేరింది. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో రాత్రికి తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పోలవరం, ఉమ్మడి గోదావరి, కాకినాడ, ఏలూరు, కోనసీమ జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.