గోదావరి పుష్కరాలు వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

15చూసినవారు
గోదావరి పుష్కరాలు వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ
AP: రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. దీనికోసం రూ.2,000 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పుష్కరాల ఏర్పాట్లు, మౌలిక వసతుల కోసం రాజమండ్రికి రూ.1,000 కోట్ల నిధులు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గతంలో నిలిచిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులన్నింటినీ తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్