భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

5509చూసినవారు
TG: ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 12 అడుగులకు చేరుకుంది. నదిలో ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున, సోమవారం అధికారులు తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గత కొద్ది రోజులుగా నీటి ప్రవాహం తగ్గి ఇసుక మేటలతో కనిపించిన నది, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జలకళ సంతరించుకుంది. అధికారులు నీటిమట్టాన్ని, ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్