ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో చంద్రబాబు జలహారతి (VIDEO)

2చూసినవారు
AP: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరే కీలక ఘట్టం బుధవారం ఆవిష్కృతమవుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాలోకి చేరనున్నాయి. పాయకరావుపేట మండలం పి.ఎల్.పురం (సీతారాంపురం) వద్ద సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చి, కాలువ రెగ్యులేటర్‌ను ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ జలాలతో అనకాపల్లి జిల్లాలో దశలవారీగా 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు, 143 గ్రామాల్లో 4.23 లక్షల మందికి తాగునీరు అందేలా ప్రణాళికలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్