'గొడ్డలి పార్టీ' రోజుకో డ్రామా ఆడుతోంది: చంద్రబాబు (వీడియో)
AP: రాష్ట్రంలో గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు అసెంబ్లీలో అమరావతే రాజధాని అన్నారు. ఎన్నికల్లో గెలిచాక మూడు ముక్కలాట ఆడారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా.. అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు’ అని వ్యాఖ్యానించారు.
