బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,800 పెరిగి రూ.1,38,850కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,970 పెరిగి రూ.1,51,480 పలుకుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.15,000 పెరగడంతో రూ.2,65,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.