హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,220 పెరిగి రూ.1,47,000కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2950 పెరిగి రూ.1,34,750కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.10,000 పెరిగి రూ.2,60,000 చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.