మధ్యప్రదేశ్‌లో బంగారు నాణేల వేట

4175చూసినవారు
మధ్యప్రదేశ్‌లో బంగారు నాణేల వేట
మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌ సమీపంలో ఒక గ్రామంలో బంగారు నాణేలు దొరుకుతున్నాయని వార్తలు రావడంతో గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలు భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. రాజ్‌గఢ్‌ రాజకోట సమీపంలో లగ్జరీ హోటల్ నిర్మాణంలో భాగంగా తవ్విన మట్టిని గ్రామంలో రోడ్డుపై పోయగా, అందులో కొందరికి 50 నుంచి 100 బంగారు నాణేలు దొరికాయని చెబుతున్నారు. ఈ నాణేలు సుమారు 500 ఏళ్ల నాటివని ప్రజలు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కర్నాటకలోని గదగ్‌ జిల్లా లక్కుండి గ్రామంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది, అక్కడ ఇంటి కోసం పునాది తీస్తుండగా శతాబ్దాల నాటి బంగారు నిధి బయటపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్