TG: వరంగల్ జిల్లా చెన్నరావుపేట(M) కోపాకులపాడులో పంట పొలంలో బంగారం లభ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి. రైతు ప్రతాప్ రెడ్డికి చెందిన ఆరు ఎకరాల భూమిని బాలు అనే రైతు కౌలుకు సాగు చేస్తున్నాడు. అయితే పొలం పనులు చేస్తుండగా బంగారం లభ్యమైంది. దీంతో కూలీలు, కౌలు రైతు మధ్య వాటాల పంచాయితీ మొదలైంది. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో, ఆరేళ్ల క్రితం భూమి అమ్మిన జైపాల్ రెడ్డి తనకు కూడా వాటా కావాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పొలంలో మరిన్ని బంగారు నిధులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.