ఏపీలో గోల్డ్ లోన్ కుంభకోణం.. బయటపడిన చాక్‌పీసులు, పిన్నులు (వీడియో)

3063చూసినవారు
AP: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) శాఖలో వెలుగుచూసిన గోల్డ్ లోన్ కుంభకోణం కలకలం రేపుతోంది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల స్థానంలో చాక్‌పీసులు, రబ్బర్ బ్యాండ్లు, పిన్నుల బాక్సులు బయటపడినట్లు ఆరోపణలు రావడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బ్యాంకు భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అయితే వ్యవహారంపై ప్రస్తుతం స్పందించలేమని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బాధ్యులపై చర్యల విషయంలో విచారణ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్