AP: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి పీవీ పార్వతీశ్వర గుప్తా హత్యకు గురయ్యారు. గత నెల 26న అదృశ్యమైన ఆయన.. శుక్రవారం రామిగడ్డ కాల్వలో విగతజీవిగా కనిపించారు. పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. పార్వతీశ్వర గుప్తా గత నెల ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కనిపించలేదు. దాంతో ఆయన సోదరుడు మన్మథరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా శ్రీకాకుళం సమీపంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు గాలించగా.. మృతదేహం లభించింది.