బంగారం ధరలు వినియోగదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు గురువారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై ఏకంగా రూ.3,770 పెరిగి రూ.1,44,550కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3,450 ఎగబాకి రూ.1,32,500 పలుకుతోంది. అటు కిలో వెండి ధర రూ. 2,44,900 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండనున్నాయి.