అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు రాబోయే రోజుల్లో భారీగా తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక తెలిపింది. ఈ ఏడాది జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయి నుంచి 37% వరకు తగ్గి, ఔన్స్ ధర 3,857 డాలర్ల నుంచి 3,500 డాలర్లకు పడిపోయే అవకాశం ఉందని తెవెల్లడించింది. యూఎస్ ఫెడ్ రేట్ల సందిగ్ధత, భౌగోళిక ఉద్రిక్తతలు, గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ బంగారం ధరలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.