ఏపీలో కళాకారులకు శుభవార్త.. త్వరలోనే ప్రత్యేక పింఛన్లు!

22280చూసినవారు
ఏపీలో కళాకారులకు శుభవార్త.. త్వరలోనే ప్రత్యేక పింఛన్లు!
ఏపీలోని  నాటక కళాకారులకు శుభవార్త. రాష్ట్రంలో కళాకారులకు ప్రత్యేక పింఛన్లు ఇచ్చే విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయనగరం జిల్లా రాజాంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్, కళాకారుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రత్యేక పింఛన్ ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్