కానిస్టేబుళ్లకు శుభవార్త.. స్టైఫెండ్ రూ.12,500కు పెంపు

13చూసినవారు
కానిస్టేబుళ్లకు శుభవార్త.. స్టైఫెండ్ రూ.12,500కు పెంపు
AP: శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు సీఎం చంద్రబాబు నాయుడు తీపికబురు అందించారు. ప్రస్తుతం వారికి అందిస్తున్న స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. మంగళగిరిలో కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేస్తున్న సందర్భంగా వేదికపై ఈ ప్రకటన చేశారు. మారుతున్న నేరాలను అర్థం చేసుకుని, క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన కానిస్టేబుళ్లకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్