AP: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు, టైం పొడిగించిన విషయం తెలిసిందే. ఇవాళ, రేపు ఏ4 మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయించవచ్చు. అలాగే 2బీ బార్లు, సీ1, ఈపీ1, టీడీ1 లైసెన్సులు కలిగిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలకు రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలు, సర్వీస్‌కు అనుమతి ఇచ్చారు.